తండేల్ కథ ఏంటంటే!
ఎంతో టైమ్ తీసుకుని డైరెక్టర్ చందూ మొండేటితో పాటూ ప్రీ ప్రొడక్షన్లో పాల్గొని నెలల తరబడి లొకేషన్ హంట్ కు వెళ్లి ఎన్నో విషయాలు నేర్చుకున్న నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో పాటూ టైటిల్ ను కూడా మేకర్స్ చైతూ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న తండేల్ అనే టైటిల్నే ఫిక్స్ చేశారు.
ఫస్ట్ లుక్ లో చైతూ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో గెడ్డం పెంచి రఫ్ లుక్ తో మాస్ లుక్ లో కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ మొత్తం సముద్రం చుట్టూనే తిరుగుతుందని ఇప్పటికే అర్థమైపోయింది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందని సన్నిహిత వర్గాల సమాచారం.
తన స్నేహితులైన జాలర్ల ప్రాణాలు పాకిస్తాన్ లో ప్రమాదంలో పడితే వాళ్లను కాపాడే క్రమంలో ఓ యువకుడు చేసే సాహసమే తండేల్ కథగా తెలుస్తోంది. హీరోయిన్ సాయి పల్లవికి కూడా సినిమాలో మంచి పాత్ర దక్కిందని, బడ్జెట్ దాదాపు రూ.80 కోట్ల వరకు అవుతుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్న తండేల్ సినిమా విజయం నాగచైతన్యకు ఎంతో అవసరం. వచ్చే ఏడాది దసరాకు తండేల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.













