పెళ్లికి చైతూ అంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నట్లు?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఎంగేజ్మెంట్ అయిపోవడంతో ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో అక్కినేని కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్ లో అంటే డిసెంబర్ లో ఓ డేట్ ను, వచ్చే ఏడాది మార్చి లో ఒక డేట్ ను పెళ్లి ముహుర్తం కోసం చూస్తున్నట్లు సమాచారం. పెళ్లి ఎప్పుడు జరిగినా సరే రాజస్తాన్ లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరగనుందని, ఇరు కుటుంబాలు చర్చించుకుని పెళ్లి డేట్ పై ఓ డెసిషన్ కు వస్తారని అంటున్నారు.
అయితే వీరి ఎంగేజ్మెంట్ కు పెళ్లికి గ్యాప్ బాగానే వస్తున్నట్లు కనిపిస్తుంది. డిసెంబర్ లో పెళ్లి జరిగినా సరే 6 నెలలు టైముంది. అదే మార్చి అయితే ఏకంగా తొమ్మిది నెలలు టైమ్ ఉంది. ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. ఇద్దరి పేర్ల మీద మంచి ముహుర్తం కోసం వెయిట్ చేస్తున్నారా లేక చైతూ సినిమా రిలీజయ్యాక పెళ్లి తంతు ప్లాన్ చేద్దామని ఇలా డిసైడ్ అయ్యారో తెలియదు మరి. ఏదేమైనా ఇలా టైమ్ దొరకడం కూడా మంచిదే. ఒకరి గురించి మరొకరి తెలియడంతో పాటూ కుటుంబం గురించి కూడా అర్థం చేసుకునే వీలుంటుంది.













