లవ్ స్టోరీ విజయానికి రీజన్స్ ఇవే..
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ముందుకెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాడు నాగ చైతన్య. శివ నిర్వాణ డైరక్షన్ లో మజిలీ రూపంలో హిట్ అందుకున్న చైతూకు ఆ సినిమా మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు చైతూకు మరో బ్లాక్ బస్టర్ ను అందిస్తున్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ చాలా పెద్ద స్థాయిలోనే వర్కవుట్ అవునుందని ఇప్పటికే అర్థమవుతుంది.
లవ్ స్టోరీ లోని ఏయ్ పిల్లా, నీ చిత్రం చూసి సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, సారంగదరియా సాంగ్ ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలవడమే కాకుండా సినిమాకు కూడా ఒక్కసారిగా హైప్ ను పెంచేసింది. లవ్ స్టోరీకి బిజినెస్ పరంగా కూడా టాక్ చాలా బావుంది. ఒక్క సారంగ దరియా సాంగ్ తోనే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే రేంజ్ లో సాంగ్ ఉంది పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆడియో హిట్ అయితే జనాలు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీనికి ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన ఉప్నెన సినిమా. ఉప్పెనకు అంతలా కలెక్షన్లు రావడానికి 70 శాతం క్రెడిట్ మ్యూజిక్కే. ఇప్పుడు దాని తర్వాత అంత హైప్ తో వస్తున్న సినిమా లవ్ స్టోరీనే. ఈ సినిమాకు పాటలు చాలా ప్లస్ కానున్నాయని అందరి అంచనా. పాటలతో పాటూ కథ, స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్ ఉండి, శేఖర్ కమ్ముల సెన్సిబిలిటీస్ కు ఆడియన్స్ మరోసారి కనెక్ట్ అయితే లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ ని ఆపడం ఎవరి వల్లా కాదనే టాక్ చాలా బలంగా వినిపిస్తుంది.













