‘లవ్ స్టోరీ’ బిసినెస్ క్రేజ్ తగ్గించిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్
క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. అనామిక రీమేక్, లవ్ ఐస్ బ్యూటిఫుల్ చిత్రాల తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి ఈయన దిల్ రాజు బేనర్లో వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా ఫిదా చిత్రం తీసి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడు. ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని సాయిపల్లవి అన్ని అంశాలలో మించి డామినేట్ చేసిందనే విషయం తెలిసిందే. ఫిదా విడుదల అయ్యికూడా మూడు సంవత్సరాలు కావస్తుంది ఈ లోగా శేఖర్ కమ్ముల నాగచైతన్య హీరోగా, ఫిదా చిత్రంతో కని కట్టు చేసిన సాయిపల్లవి మరో సారి నటిస్తూ ఉండటం విశేషం ఆమెని హీరోయిన్గా పెట్టి ఫిదా టైప్ లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే సింపుల్ టైటిల్ గా ‘లవ్ స్టోరీ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీని ఏషియన్ ఫిల్మ్ సంస్థ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేసిన చిత్రం కావడం, మరోవైపు వరుసగా మజిలి, వెంకీ మామ వంటి హిట్ల తర్వాత నాగచైతన్యకి హ్యాట్రిక్ ఇచ్చే మూవీగా ఇది రూపొందుతూ ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సాయిపల్లవినే కాదు… నాగచైతన్య సైతం గ్రామీణ ప్రాంతంలోని తెలంగాణ పోరడిగా నటిస్తూ ఉండటం విశేషం.
లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. లేకపోతే ఈ పాటికే థియేటర్లలో విడుదలై ఓటీటీలలో కూడా ప్రసారం అయి ఉండేది. ఈ చిత్రానికి సంబంధించిన కొంత పని పెడింగ్ మాత్రమే ఉందిట. లాక్ డౌన్ ముగిసిన పది పదిహేను రోజులలోనే ఈ పెండింగ్ ని పూర్తి చేసి థియేటర్లలో వినాయక చవితి కానుకగా ఆగష్టు 22న ఈ మూవీని విడుదల చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లానింగ్ సూపర్ గానే ఉంది కానీ ఈ చిత్రం బిజినెస్ విషయంలోనే తలనొప్పులు వస్తున్నాయట. అందరు ఫామ్ లో ఉన్న వారు.. మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయిపల్లవిలు పనిచేస్తూ ఉండటంతో ఈ చిత్రం బిజినెస్ 40కోట్లకు పైగా జరపాలని ఏషియన్ సంస్థ భావిస్తోంది. దానికి కారణం నాగచైతన్య దీని ముందు నటించిన మజిలి, వెంకీ మామ చిత్రాలు రెండు 40కోట్ల వరకు బిజినెస్ చేయడమే కారణం. కానీ బయ్యర్లు ఈ చిత్రంపై అంత పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా లేమని తప్పించుకుంటున్నారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ ముగిసినా మరలా థియేటర్లకు ఒకప్పటిలా ఆడియన్స్ వస్తారో లేదో అన్న అనుమానం, ఒకవేళ వచ్చిన థియేటర్లలో 50 పెర్సెంట్ సీటింగ్ కెపాసిటీ వుండడంతో కలెక్షన్స్ తగ్గుతాయని భయం బయ్యర్లలో ఉంది. అందునా మజిలి చిత్రం విషయానికి వస్తే సమంత ఫ్యాక్టర్, వెంకీమామకి విక్టరీ వెంకటేష్ లు తోడయ్యాయి కాబట్టే 40కోట్ల రేంజ్ ని అందుకుందని, కానీ లవ్ స్టోరీ విషయంలో కేవలం నాగచైతన్యని చూసి అంత మొత్తం ధరలు పెట్టడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు. దాంతో సాయిపల్లవిని ప్రమోషన్స్ లో హైలైట్ చేయాలని భావిస్తున్నారట. అయినా కూడా అంత మొత్తం పెట్టడం రిస్క్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం లవ్ స్టోరీకి వ్యాపార పరంగా సినిమా విడుదల చేయడానికి నిర్మాతలే దిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుగు సినీ ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నారు.













