NC24: సైలెంట్ గా మొదలెట్టేసిన చైతన్య
తండేల్(Thandel) సినిమాతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), ఆ సినిమాతో రూ.100 కోట్ల మూవీని అందుకున్నాడు. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా చైతన్యకు కొత్త ఫ్యాన్స్ ను కూడా తీసుకొచ్చింది. తండేల్ సక్సెస్ ను కంటిన్యూ చేయాలనే ఆలోచనతో తన తర్వాతి సినిమా విషయంలో చైతన్య ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు.
తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష(Virupaksha) ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకోగా బుధవారం సినిమా షూటింగ్ ను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో మేకర్స్ చిత్ర యూనిట్ ను పరిచయం చేస్తూ, ఆఖరిగా చైతూ లుక్ ను కూడా రివీల్ చేశారు. ఈ లుక్ కోసం చైతన్య ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. రీసెంట్ గా తండేల్ కోసం మేకోవర్ చేసిన చైతూ ఇప్పుడు మరోసారి NC24 కోసం మేకోవర్ చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad), సుకుమార్(Sukumar) కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వృషకర్మ(Vrusha Karma) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.






