NC24: చైతన్య నెక్ట్స్ మూవీ అప్డేట్
తండేల్(Thandel) సినిమాతో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చైతన్యకు తండేల్ సినిమా కొత్త జోష్ ను ఇచ్చింది. ఈ సినిమాతో చైతూ మంచి కం బ్యాక్ ఇచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు. తండేల్ తర్వాత నాగ చైతన్య తన తర్వాతి సినిమాను కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.
చైతన్య కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని గతేడాది నవంబర్ లో చైతూ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ ను బట్టి చూస్తుంటే NC24 మైథలాజికల్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర(Sri Venkateswara Cine Chitra) మరియు సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
కార్తీక్ తో చైతూ చేయబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎలాంటి హంగామా లేకుండా మొదలైపోయినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఓ నాలుగు రోజుల షూటింగ్ కూడా అయిపోయిందని, త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవనున్నట్టు సమాచారం అందుతుంది. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నాడు.













