Naga Chaitanya: NC24 కోసం చైతూ స్ట్రిక్ట్ డైట్

తండేల్(Thandel) సినిమాతో ఫ్లాపులకు చెక్ పెట్టి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya). తండేల్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న చైతన్య ఆ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. మోస్ట్ హ్యాండ్‌సమ్ గా ఉండే చైతూ(Chaitu) తండేల్ కోసం ఎంతో మేకోవర్ చేసి జాలరిగా కనిపించాడు. అయితే చైతూ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తండేల్ తర్వాత నాగ చైతన్య కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చైతూ కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కూడా చైతన్య మేకోవర్ చేస్తున్నాడని తెలుస్తోంది. NC24 వర్కింగ్ టైటిట్ గా తెరకెక్కుతున్న ఈ మిథికల్ థ్రిల్లర్ లో చైతన్య సాహసకుడిగా కనిపించనున్నాడట. తన జర్నీలో ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్లను ఎదుర్కొనే కఠిన వ్యక్తిగా చైతన్య ఈ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం.
ఆ క్యారెక్టర్ కోసం చైతూ ఇప్పుడు తనను తాను మార్చుకుంటున్నాడని అంటున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన చైతన్యకు ఇది పెద్ద కష్టమేం కాదు కానీ ట్రైనర్ ను పెట్టుకుని మరీ ఒక పద్ధతి ప్రకారం చైతన్య ఈ మేకోవర్ ప్రాసెస్ ను చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని కోసం చైతన్య స్ట్రిక్ట్ డైట్ ను కూడా ఫాలో అవుతున్నాడట. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.