Naga Chaitanya: అప్పటివరకు చైతూ బిజీనే!
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పెద్ద కొడుకు నాగ చైతన్య(Naga Chaitanya) ఇటీవలే నటి శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala)ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన దగ్గర్నుంచి పుణ్య క్షేత్రాలు తిరుగుతూ వచ్చిన వీరిద్దరూ త్వరలోనే హనీమూన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ నాటికి ఈ జంట ఫారిన్ వెళ్లి దాదాపు నెల రోజుల పాటూ అంటే జనవరి ఎండింగ్ వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.
హనీమూన్ నుంచి వచ్చాకే చైతూ తండేల్(Thandel) ప్రమోషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చైతూ(Chaithu), శోభితల పెళ్లి ఇరు కుటుంబ సన్నిహితుల మధ్య చాలా ఆడంబరంగా జరిగింది. చైతూ తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా కోసమే చైతూ గుబురు గెడ్డాన్ని పెంచాడు.
గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యానర్ లో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తోంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 2025 శివరాత్రి కానుకగా తండేల్ రిలీజ్ కానుంది. చైతూ హనీమూన్ నుంచి రాగానే తండేల్ ప్రమోషన్స్ షురూ కానున్నట్లు సమాచారం. మరి శోభిత పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.













