మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘సవ్యసాచి’ చేయడం హ్యాపీ – యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

‘ఏ మాయ చేసావె’, ‘ప్రేమమ్’ వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఈయన హీరోగా ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలుగా ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సవ్యసాచి’. చిత్రం విడుదల సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో ఇంటర్వ్యూ…..
‘సవ్యసాచి’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
– ‘ప్రేమమ్’ సినిమాను నార్వేలో చిత్రీకరిస్తున్నప్పుడు డైరెక్టర్ చందు మొండేటి ‘సవ్యసాచి’లో మెయిన్ పాయింట్‌ను 5-10 నిమిషాలు వివరించారు. ఇలాంటి పాయింట్‌తో సినిమా చేస్తే ఎక్స్‌పెరిమెంట్ అవుతుందేమోనని అన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి కథను కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అలా జర్నీ స్టార్ట్ అయ్యింది.
స్క్రిప్ట్‌లో మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉంటుంది?
– స్క్రిప్ట్ రెడీ తయారవుతున్న దశలో ఇన్‌వాల్వ్ అవుతాను. ప్రతి స్క్రిప్ట్ వింటాను. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచిస్తాను. కానీ ఒక లైన్ దాటి మనం వెళ్లకూడదని మాత్రం అనుకుంటా. దర్శకుడికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అక్కడే తెలుస్తుంది.
‘సవ్యసాచి’ కథ వినగానే మీకెమనిపించింది?
– చందు నెరేషన్ చాలా చక్కగా ఇచ్చాడు. తన ఆలోచనా ధోరణిని నేను బాగా ఇష్టపడతాను. తన మీద నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నా. ‘ప్రేమమ్’ రీమేక్ చేయవద్దని చాలా మంది చెప్పారు. కానీ పాయింట్‌ని చందు చక్కగా డీల్ చేశాడు. తెలుగు ఆడియెన్స్‌కు తగినట్లు బాగా బ్లెండ్ చేశాడు. నా దృష్టిలో తను న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఈ సినిమా ఒకటీ, రెండు షెడ్యూళ్ల వరకు కాస్త ఎలా ఉంటుందోనని అనిపించింది. కానీ ఆ తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదనపించింది.
వానిషమ్ సిండ్రోమ్ గురించి మీకు ముందే తెలుసా?
– లేదండీ. కాకపోతే ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను దాని గురించి ఆలోచించా. యూట్యూబ్‌లోనూ, న్యూస్ పేపర్లలోనూ చూసి తెలుసుకున్నా.
‘హలో బ్రదర్’ స్టయిల్లో ఉంటుందా?
– లేదండీ. ఆ సినిమాలో నాన్నగారు ట్విన్స్‌లా నటించారు. కానీ ఇందులో అలా కాదు.. ట్విన్స్‌లో ఒకరు వానిష్ అయిపోతే ఆ లక్షణాలు మరొకరికి వస్తాయి. అందుకనే ఉన్న వ్యక్తి ఎడమచేయి మరో వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. అదే కదా వానిషమ్ సిండ్రోమ్. ఇక్కడ ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్న ఫీలింగ్ కలుగుతుంది.
డాన్సుల కోసం బాగా కష్టపడ్డట్టున్నారు?
– మామూలుగా డ్యాన్సులు చేయడంలో ప్రతి ఒక్కరికీ ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. దాని ప్రకారమే మాస్టర్స్ డాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ‘సవ్యసాచి’ విషయానికి వస్తే శేఖర్ మాస్టర్ నాలో ఆ శైలిని గమనించారు. చాలా మంచి నృత్యాలను కంపోజ్ చేశారు.
సినిమా మొత్తం యాక్షన్ జోనర్‌లోనే ఉంటుందా?
– లేదండీ. తొలి సగంలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరదాగా ఉంటుంది. ఉదాహరణలకు నాకూ, నా ఎడమ చేతికి మధ్య చిన్న చిన్న గొడవలూ, రొమాన్స్.. ఇలాగన్నమాట. సెకండాఫ్‌లో మాత్రం నాకు, మాధవన్‌గారికి చాలా గట్టి కాంపిటిషన్ ఉంటుంది.
మీ తాతగారు పౌరాణికాలు చేశారు. మీరు కూడా చేస్తారా?
– నాకూ చేయాలనే ఉంది. కాకపోతే రెండు, మూడు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన తర్వాత చేస్తాను.
ప్రారంభంలో కెరీర్‌ని మీ నాన్నగారు జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టేనా?
– కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల స్క్రిప్ట్ లు నాన్నగారు విన్నారు. ఆ తర్వాత అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ‘సవ్యసాచి’ రిలీజ్‌కి ముందు ఎడిటింగ్ రూమ్‌లో చూసి సలహాలు చెప్పేవారు. ఈ సినిమాకు కూడా చెప్పారు. చిన్న చిన్న భావోద్వేగాలకు సంబంధించినవి.
రీ షూట్‌కి వెళ్లడమనే కాన్సెప్ట్‌పై నమ్మకం ఉందా?
– నమ్ముతానండీ. సినిమా విడుదలైన తర్వాత మనం గమనించిన అదే తప్పును ఇంకెవరో గమనించి చెప్పినప్పుడు.. వాటిని దిద్దుకోవడం కన్నా, ముందే వాటిని దిద్దుకుంటే సరిపోతుందని నా ఫీలింగ్. అయినా రీ షూట్‌లకు వెళ్లడం అని ఎందుకు అనుకోవాలి? బెటర్‌మెంట్ కోసం చేస్తున్నామని అనుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు కదా.
‘లగాయిత్తు…’ పాట రీమిక్స్ ఆలోచన ఎవరిది.. నాగార్జున కనిపిస్తారా?
– ‘లగాయిత్తు..’ పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచిన మాత్రం చందు మొండేటిది. ఆయన చాలా బాగా చేశారు. సెకండాఫ్‌లో కథలో పాటను చక్కగా బ్లెండ్ చేశారు. ఒరిజినల్ సాంగ్‌ని కంపోజ్ చేసిన కీరవాణిగారే చేయడం వల్ల కూడా టెన్షన్ ఫ్రీ అయింది. లేకుంటే ఎందుకు ఎక్స్ పెక్టేషన్స్… అని అనుకున్నా. ఇప్పుడు అంతా హ్యాపీ. నాన్నగారు ఆ పాటలో కనిపించరు.
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ గురించి చెప్పండి?
– కథను నమ్మి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కానీ నిర్మాతలున్న సంస్థ మైత్రీ మూవీస్ వారు ఉండటంతో స్పాన్ ఎంతో పెరిగింది. మాధవన్ గారిని, భూమికగారిని సజెస్ట్ చేసింది కూడా వాళ్లే.
మాధవన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
– మాధవన్‌గారు ఇప్పటికీ ట్రెండ్ స్టెరే. ఆయనతో కలిసి పనిచేయడగం ఆనందంగా ఉంది. సెట్ కీ నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి, ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నా.
హీరోయిన్ నిధి గురించి…?
– నిధి చాలా టాలెంటెడ్. యాక్టివ్ గర్ల్. ఆల్ రౌండర్. డ్యాన్సలుఉ చేయగలదు. ఇలాంటి సినిమాల్లో ఫ్రెష్ ఫేస్‌లు క్లిక్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ. అందుకే తీసుకున్నాం.
శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎలా ఉంటుంది?
– ఇంకా టైటిల్ అనుకోలేదు. సినిమాలో కూడా నేను, సామ్ పెళ్లైన జంటగానే కనపడుతున్నాం. నిత్యం గొడవపడే జంటగా కనపడతాం. నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు లాంటివిలేవు. సో సెట్లో నటిస్తున్నాం. కలిసి ఎక్కువ సమయాన్ని గడపడానికి వీలవుతోంది. ఎవరినీ ఎవరూ డామినేట్ చేయకుండా నటిస్తున్నాం. సమ్మర్‌కి విడుదలవుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ అంతా పూర్తవుతుంది. మరో వైపు వెంకీమామ సినిమా డిసెంబర్ నుంచి మొదలవుతుంది.
చందు దగ్గర మీకోసం చాణక్య అని మరో స్క్రిప్ట్ ఉందట కదా?
– ప్రేమమ్ తర్వాత మీతో మరలా సినిమా చేయాలని ఉంది అని అన్న తొలి దర్శకుడు చందు. అది నటుడిగా నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. తను ప్రేమమ్ తర్వాత చాణక్య స్క్రిప్ట్ కూడా చెప్పాడు. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాను.