Thandel: తండేల్ ఫ్యాన్స్ కు టెన్షన్
నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్(Thandel) సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంటే రిలీజ్ కు మరో 43 రోజులు మాత్రమే టైముంది. రిలీజ్ దగ్గర పడటంతో అక్కినేని ఫ్యాన్స్ తండేల్ ప్రమోషన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటన వల్ల జరిగిన పరిణామాల వల్ల అల్లు అరవింద్(Allu Aravind) చాలా ఒత్తిడితో బిజీగా ఉన్నారు.
మరోవైపు బన్నీ వాస్(Bunny Vas) కూడా అదే కేసు పనుల్లో ఉంటూ బన్నీతోనే ఉంటున్నాడు. ఇలాంటి టైమ్ లో తండేల్ ప్రమోషన్స్ ఎలా చేయాలనేది ఆలోచించడం అటు అరవింద్‌కి, ఇటు బన్నీ వాస్‌కి ఇద్దరికీ కష్టమే. సినిమాపై నమ్మకంతో బడ్జెట్ అయితే భారీగా పెట్టారు. ఆ నమ్మకంతోనే మంచి రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుని బ్లాక్ బస్టర్ అందుకోవాలని డిసైడయ్యారు.
కానీ పుష్ప2 రిలీజ్ తర్వాత అన్నీ మారిపోయాయి. అయినా సరే టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఎంతలేదన్నా బన్నీ(Bunny)కి ఈ కేసులో త్వరగానే ఊరట లభించే అవకాశముంది. అల్లు అర్జున్ నేరుగా నేరస్థుడు కాదు కాబట్టి సానుకూల ఫలితమొచ్చే ఛాన్సులే ఎక్కువ. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తండేల్ కు నెవర్ బిఫోర్ పబ్లిసిటీని ఆశిస్తున్నారు. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు.













