చైతూ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ అలా!
కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జానర్లలో కొత్త సినిమాలను చేస్తూ వస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య, తర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో చేయనున్నాడు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. విరూపాక్ష సినిమాలానే ఈ సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం నాగ చైతన్య తన కెరీర్లోనే మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చైతూ ద్విపాత్రాభినయం చేయలేదు. శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో హలో బ్రదర్ రీమేక్ కార్యరూపం దాల్చి ఉంటే చైతన్య డ్యూయల్ రోల్ లో కనిపించేవాడు.
కానీ ఆ సినిమా డిస్కషన్స్ స్టేజ్ లోనే ఆగిపోయింది. ఇన్నాళ్లకు చైతూ కార్తీక్ దండు సినిమాలో డ్యూయల్ చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఎంతో ప్రధానంగా ఉంటుందని, అందుకే చైతూకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒక లైలా కోసం 2014లో జోడీ కట్టిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి, నవంబర్ లో చైతూ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.













