డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన చైతూ
సమంత తో విడాకులు తీసుకుని నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం డేటింగ్ మాత్రమే కాదు, ఆ హీరోయిన్ ను చైతూ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంలో నాగ చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం నాగచైతన్య దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్లపై రియాక్ట్ అయ్యాడు. తనపై ఎన్ని రూమర్లొచ్చినా పర్లేదంటూ నవ్వేశాడు. అంతేకాదు హీరోయిన్ తో లింకులు పెడుతూ తనపై వచ్చిన వార్తలను తను లెక్క చేయనని, ఈ విషయాల్లో క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్స్ ఆగవని చైతూ అన్నాడు.
ప్రస్తుతం తాను తన పర్సనల్ స్పేస్ లో చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పిన చైతన్య, ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నప్పుడు తానే అందరికీ చెబుతానని వెల్లడించాడు. దీంతో చైతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైతూ నటించిన దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ పై చైతూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దూతకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.













