మరోసారి లవ్ సోర్టీలో చైతూ.. సాయిపల్లవి
ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులకు నచ్చేలా తనదైన శైలిలో తెరకెక్కించగలరు దర్శకులు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, ఫిదా చిత్రాలే అందుకు నిదర్శనం. తాజాగా ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ్‌దాస్ కె.నారంగ్, పి.రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. ఆల్రెడీ అందుకు తగ్గ శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు లవ్ స్టోరీ లనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం.













