లవ్ స్టోరీ కి ముహూర్తం కుదిరింది
కథానాయకుడు నాగచైత్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా రూపొందించిన సినిమా లవ్ స్టోరీ. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదలద కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్‌లో సారంగదరియా ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. హే పిల్లా .. నీ చిత్రం చూసి.. పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఆమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె.నారాయణ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ స్వరాలందించగా, విజయ్ సి.కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.













