నాగచైతన్య జోడీగా సాయిపల్లవి ?
శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకం. ఆయన స్టార్ కథానాయకుల వెంటపడరు. తన కథకు ఎవరు బాగుంటారో, వాళ్లనే ఎంచుకుంటారు. వీలైనంత వరకూ కొత్త వాళ్లతో సినిమాలు చేస్తుంటారు. ఆయన నుంచి ఫిదా తరువాత మరో సినిమా రాలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతోంది. నాగత చైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రానున్నదని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుందని సామాచారం. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తారట. వెంకీ మామ తో బిజిగా ఉన్నారు చైతన్య. బంగార్రాజు కూడా లైన్లోనే ఉంది. మరి శేఖర్ కమ్ముల చిత్రాన్ని ఎప్పుడు మొదలెడతారో చూడాలి.













