Naga Chaitanya: శోభిత డెసిషన్స్ చాలా పర్ఫెక్ట్: నాగ చైతన్య
నాగ చైతన్య(Naga Chaitanya), శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala) గేతడాది డిసెంబర్ లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య నటించిన తండేల్(Thandel) సినిమా ఈ నెల 7వ తేదీన రిలీజ్ కానున్న సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో చైతూ(Chiathu) చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ శోభిత గురించి మాట్లాడాడు. తాను ప్రతీ విషయాన్ని శోభితతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతానని, కొన్ని కీలక విషయాల్లో ఆమె ఇచ్చే సలహాలు తనకు ఎంతగానో ఉపయోగపడతాయని, తాను అయోమయంలో ఉన్నప్పుడు శోభిత ఇచ్చే సపోర్ట్ తనని మళ్లీ నార్మల్ గా మారుస్తుందని తెలిపాడు.
అంతేకాదు, శోభిత డెసిషన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయని, ఆమె నిర్ణయాన్ని తానెప్పుడూ గౌరవిస్తానని, తానేం చేయాలన్నా శోభిత ఓకే చెప్పాకే చేస్తానని చైతూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వైజాగ్ లో జరిగిన తండేల్ చిత్ర ట్రైలర్ లాంచ్ లో భాగంగా తనకు వైజాగ్ అంటే ఇష్టమని, ఇంట్లో రూలింగ్ పార్టీ కూడా వైజాగేనని, తన సినిమాను వైజాగ్ లో సపోర్ట్ చేయాలని చైతూ చెప్పిన విషయం తెలిసిందే.













