Naga Chaitanya: ఫోటోల్లో శోభిత ఎందుకు నవ్వదో చెప్పిన చైతూ
కొన్ని సినిమాలుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య(Naga Chaitanya)కు శోభితా ధూళిపాళ(Sobhitha Dhulipala)ను పెళ్లి చేసుకున్న తర్వాత తండేల్(Thandel) ద్వారా మంచి హిట్ దక్కింది. తండేల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని లేదంటే ఇంట్లో పరువు పోతుందని చైతూ స్టేజ్ పైనే చెప్పాడు. మొత్తానికి ఆ మూవీతో భారీ హిట్ అందుకుని రిలాక్స్ అయిన చైతన్య, రీసెంట్ గా భార్య శోభితతో కలిసి వోగ్(Vogue) కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో చైతూ శోభిత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. శోభిత తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందని, శోభితలోని ఆ విషయం తనకు చాలా బాగా నచ్చుతుందని చైతూ చెప్పాడు. ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడతారని, కానీ తాను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం బాగా అలవాటైందని, ఇంట్లో తాను ఇంగ్లీష్ లోనే మాట్లాడతానని చైతూ చెప్పాడు.
శోభిత తెలుగు ముందు తన భాష వేస్ట్ అని, తెలుగు నేర్పించమని భార్యను అడుగుతుంటానని చైతూ చెప్పాడు. శోభితకు మేధస్సు ఎక్కువని, దాన్ని తనకు కూడా ఇవ్వమని చెప్తుంటానని అంటున్న చైతూ, శోభితను ఫోటోల్లో ఎందుకు నవ్వవని అడిగితే నేను నవ్వుతూనే ఉన్నాను, మీరెవరూ దాన్ని చూడలేకపోతున్నారని అంటుందని చెప్పుకొచ్చాడు.













