Naga Chaitanya: ఎన్టీఆర్ అలా చెప్పడం చాలా బాగా అనిపించింది
ఈ ఇయర్ తండేల్(Thandel) తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య(naga chaitanya), తన తర్వాతి సినిమాను విరూపాక్ష(virupaksha) ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య తన సినిమా గురించి, ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడాడు. కార్తీక్ తో తాను చేస్తున్న 24వ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతుందని చెప్పాడు.
అయితే చైతన్య గత కొంతకాలంగా ఫుడ్ బిజినెస్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. షోయు(Shoyu) అనే పేరుతో నాగ చైతన్య హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ ను మొదలుపెట్టి, రకరకాల కొత్త రుచులను పరిచయం చేస్తున్నాడు. ఈ రెస్టారెంట్ పై జూ. ఎన్టీఆర్(NTR) దేవర(Devara) జపాన్ ప్రమోషన్స్ లో మాట్లాడాడు. హైదరాబాద్ లోని బెస్ట్ ఫుడ్ దొరికే ప్రదేశాల గురించి చెప్పమని యాంకర్ ఎన్టీఆర్ ను అడగ్గా దానికి ఎన్టీఆర్ రెస్పాండ్ అయి కొన్ని ప్రదేశాల పేర్లు చెప్పాడు.
అందులో నాగచైతన్య షోయు కూడా ఉంది. హైదరాబాద్ లో అన్ని రకాల ఫుడ్ దొరుకుతుందని, ముఖ్యంగా జపనీస్ ఫుడ్ అయిన సుషి చాలా టేస్టీగా దొరికే షోయు అనే రెస్టారెంట్ ఉందని, అది తన తోటి నటుడైన నాగచైతన్యదేనని ఎన్టీఆర్ చెప్పాడు. ఎన్టీఆర్ తన రెస్టారెంట్ గురించి మాట్లాడిన వీడియో చూసిన రోజు తనకెంతో ఆనందమేసిందని నాగ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.






