విశ్వాసం లేని నా కుక్క అంటున్న నాగబాబు
సోషల్ మీడియాకు యూజర్స్ పెరిగిన తర్వాత వివాదాలు పెరిగాయి, మాటల యుద్ధాలూ పెరిగాయి. ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా క్షణాల్లో దానికి సమాధానం ఇచ్చే వెసులుబాటు సోషల్ మీడియాలో ఉంది. దాంతో ఎవరూ వెనక్కి తగ్గరు. ఎవరికి తోచింది వారు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు సినిమాలకు, టీవీ ప్రోగ్రామ్స్‌కి మాత్రమే పరిమితమైన మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సోషల్ మీడియాలో చీటికీ మాటికీ విరుచుకుపడుతున్నాడు. తన ఫ్యామిలీ గురించి ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా ఊరుకోవడం లేదు. ఆమధ్య బాలకృష్ణ చేసిన కామెంట్స్ తీవ్రంగా స్పందించిన నాగబాబు.. బాలకృష్ణను నోరు అదుపులో పెట్టుకోమని సలహా ఇచ్చాడు. ఈమధ్యకాలంలో ఇలాంటి కాంట్రవర్సీలపై చాలా సార్లు స్పందించాడు నాగబాబు. అయితే కొన్నిసార్లు సందర్భం సృష్టించుకొని మరీ వార్తల్లోకి వస్తున్నాడు. దీనంతటికీ మరో కారణం ఉంది.
అదేమిటంటే తన ఆధ్వర్యంలోనే నడిచే ఓ యూ ట్యూబ్ ఛానల్. దాని మనుగడ సాగాలంటే ఏదో ఒక అప్డేట్ ఉండాలి కదా. అందుకే ఇలా అప్పుడప్పుడు వార్తల్లోకి వచ్చి హల్చల్ చేస్తుంటాడని తెలుస్తోంది. తాజాగా విశ్వాసం లేని నా కుక్క అంటూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో తన పెంపుడు కుక్క గురించి చెప్పాడు నాగబాబు. 2016 నుంచి తనతోనే ఉన్న పీకు అనే కుక్క తన పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుందని, ఎవరైన తనను సరాదాగా కొట్టినా వాళ్ల మీద దాడి చేస్తుందని చెప్పాడు. అయితే ఇటీవల నాగబాబు చేసిన ఓ అల్లరి పనితో తన కుక్క విశ్యాసం లేని కుక్క అని తేలిపోయింది అని సరదాగా వ్యాఖ్యనించాడు.
తన భార్యకు పాముల పట్ల ఉన్న భయం పోగొట్టేందుకు ఓ రబ్బరు పామును ఆమె చేతికి ఇవ్వటంతో ఆమె ఒక్కసారిగా ఇంట్లోకి పారిపోయింది. ఆమె వెనకే తన పెట్ డాగ్ కూడా పారిపోయింది. ఈ సంఘటన గురించి స్పందించిన నాగబాబు. ఇన్నాళ్లు నా కుక్క నా కోసం పోరాటం చేస్తుంది అనుకున్నా.. కానీ అది నా ప్రాణాల గురించి పట్టించుకోకుండా నా జీవితం నాకు ముఖ్యం అనుకుంది. మా పీకూకి కూడా మనిషి లక్షణాలు వచ్చాయి. విశ్యాసం లేని నా కుక్క అంటూ సరదాగా ఆ వీడియోను షేర్ చేశాడు.













