ఎన్టీఆర్ బయోపిక్ లో మరో ప్రముఖ నటుడు
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మరో ప్రముఖ నటుడు జాయిన్ అయ్యారు. ఎస్వీ రంగారావు పాత్రకు మెగాబ్రదర్ నాగబాబును ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అసెంబ్లీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













