Naga Babu: మహేష్ బాబు గురించి నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న మహేష్ బాబు(mahesh babu), ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకడైన మహేష్ అందానికి అభిమాని కాని వారుండరంటే ఆశ్చర్య పడనక్కర్లేదు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తమ్ముడు నాగబాబు(Naga babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఈక్వల్ గా ఇండస్ట్రీలో ఎవరైనా హీరో ఉన్నాడా అంటే అది మహేషేనని, మహేష్ కు ఉన్నంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు ఉండదని, అందం పరంగా మహేష్ బాబుతో పోటీ పడే మగాడు మరొకడు లేడని నాగ బాబు అన్నాడు.
తన భార్య పద్మ(Padma) కూడా మహేష్ కు పెద్ద అభిమాని అని, మహేష్ ను ఆమె తమ్ముడిగా ఫీలవుతూ ఉంటుందని తెలిపాడు. అంతేకాదు, మహేష్ చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉంటాడని చెప్పిన నాగబాబు, ఆ లుక్స్ ను మార్చుకోవడానికి మహేష్ ఎంత కేబీఆర్ పార్క్ లో ఎంతగా కష్టపడుతూ పరిగెత్తేవాడో తనకు తెలుసని, ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేవరకు మహేష్ నిద్ర పోడని, మహేష్ లోని ఆ గుణమే తనకెంతో నచ్చుతుందని చెప్పాడు నాగబాబు.













