ఆ సెంటిమెంట్‌తోనే ముందుకెళ్తున్న నాగ్
నాగార్జున నటిస్తున్న నా సామిరంగ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఫలానా రోజు అని మాత్రం డేట్ ను అనౌన్స్ చేయలేదు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. నాగ్ గత కొంత కాలంగా ఏ సినిమాకూ పనిచేయనంత వేగంగా ఈ సినిమాకు రాత్రీపగలు కష్టపడుతున్నాడు.
ఇప్పటికే హీరోయిన్ ఇంట్రో టీజర్ వచ్చేసింది. ఫస్ట్ లిరికల్ కూడా అతి త్వరలోనే అని పోస్టర్ వచ్చింది. అన్నీ ఓ ప్లాన్ ప్రకారం రిలీజ్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. సోగ్గాడే చిన్ని నాయన సినిమా సంక్రాంతి రేసులోనే రిలీజై మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ నాగ్ ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న నా సామిరంగ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇట్టే ఇంప్రెస్ చేయొచ్చన్న ఆలోచనతో నాగ్ ప్రణాళికలు రచిస్తున్నాడట. ఫ్యామిలీ స్టార్ ఎలాగూ డ్రాప్ అయింది కాబట్టి ఈ సినిమాకు అది ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఈ వారం పది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశముంది.













