ఊహించని రిజల్ట్‌తో నభా షాక్
నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నభా నటేష్ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా చెప్పుకోదగ్గ హిట్ కాకపోయినా నభాకు ఛాన్సులైతే వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మ్యస్ట్రో, అల్లుడు అదుర్స్ అంటూ వరుసగా టైర్2 హీరోల సరసన సినిమాలు చేసింది.
కానీ అందులో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే అమ్మడికి పేరు తీసుకొచ్చింది. తర్వాత నభాకు ఛాన్సులు రావడం తగ్గింది. దానికి తోడు యాక్సిడెంట్ వల్ల అమ్మడి కెరీర్ కు పెద్ద బ్రేక్ పడింది. దీంతో తెలుగు ఆడియన్స్ నభాను దాదాపు మర్చిపోయారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నభా అవకాశాల కోసం ఎంతో ఎదురుచూసి ప్రియదర్శితో కలిసి డార్లింగ్ అనే సినిమా చేసింది.
ఒకప్పుడు స్టార్లతో సినిమాలు చేసిన నభా, ఇప్పుడు ప్రియదర్శి లాంటి చిన్న హీరోతో కలిసి రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. డార్లింగ్ లో తన క్యారెక్టరే కీలకమని, నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడం వల్లే నభా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుంది. డార్లింగ్ తో తనకు మంచి రీఎంట్రీ దక్కుతుందని ఆశపడిన నభాకు ఈ సినిమా నిరాశే మిగిల్చింది. పూర్తి నెగిటివ్ టాక్ తో వీకెండ్ లోనే డార్లింగ్ వాషౌట్ అయింది. సినిమా ఫ్లాపైనా నభాకు పేరొచ్చిందా అంటే అదీ లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రలో నభా యాక్టింగ్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. సినిమాకు నభానే మైనస్ అనే స్థాయిలో ఆమె యాక్టింగ్ ఉందని, లుక్స్ పరంగా నభా బాలేదని ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామనుకున్న నభాకు ఇలాంటి పరిస్థితి రావడం పాపమనే చెప్పాలి.













