డబుల్ ఇస్మార్ట్ లో సూపర్ ట్విస్ట్
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్ పాత్ర చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు పూరీ. ది వారియర్, స్కంద సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకున్న రామ్ కి కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద డబుల్ కలెక్షన్స్ ను అందిస్తుందని మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూరీ ఓ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ పాత్ర ఆ సినిమా స్టార్టింగ్ లోనే చనిపోతుంది. నభా నటేష్ ని చంపాడనే హీరో, విలన్ పై రివెంజ్ తీర్చుకుంటాడు. అయితే పూరీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో నభా క్యారెక్టర్ ను మళ్లీ తీసుకురాబోతున్నాడట. సినిమాలో ఈ ట్విస్టే హైలైట్ కానుందట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులని పెట్టడంలో పూరీ ఎంతో నిపుణుడు. ఆడియన్స్ కు ట్విస్ట్ ఇవ్వాలనే కారణంతోనే మేకర్స్ ఈ సినిమాలో నభా క్యారెక్టర్ ను దాచి పెట్టినట్లు తెలుస్తోంది.













