నా సామిరంగ ఓ టెన్షన్ తీరింది..
సంక్రాంతికి రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల్లో అక్కినేని నాగార్జున నటిస్తున్న నా సామిరంగ కూడా ఒకటి. జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ స్పీడ్ ను కూడా నా సామిరంగ టీమ్ పెంచింది. ఓటీటీ, డిజిటల్ డీల్ కూడా అవకుండానే డేట్ అనౌన్స్ చేశారనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బాగా వినిపించింది.
కానీ స్టార్ మా తో తనకున్న బాండింగ్ ద్వారా నాగ్, ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ డీల్స్ ను క్లోజ్ చేయించాడని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ మినహాయించి సుమారు రూ.30 కోట్లకు పైగా ఈ డీల్ ను నాగ్ సెట్ చేశాడని సమాచారం. దీంతో నా సామిరంగకు ఓ టెన్షన్ తీరిపోయినట్లైంది. థియేటర్ల విషయాన్ని కూడా నాగ్ పర్సనల్ గా తీసుకుని మరీ డీల్ చేస్తున్నాడని తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎక్కువ శాతం ఏరియాలకు పంపిణీ చేసే బాధ్యతను నాగ్ తీసుకున్నాడట. నా సామిరంగకు వీలైనన్ని స్క్రీన్లు దక్కేలా నాగ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. నాగ్ సినిమా వచ్చేసరికి గుంటూరు కారం మూడో రోజులోకి ఎంటరవుతుంది కాబట్టి ఫస్ట్ డే తనకు బెనిఫిట్ ఉండేలా ఎక్స్ట్రా షో ల కోసం కూడా నాగ్ ట్రై చేస్తున్నాడట. సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతూ, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్న నాగ్ కు నా సామిరంగ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













