క్లారిటీ ఇవ్వాల్సింది నాగ్ ఒక్కడే !
ఎప్పటిలానే వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి సినిమాల పోటీ ఉంది. కాకపోతే ఈసారి ఆ పోటీ కొంచెం ఎక్కువగా ఉంది. ఎంత పండగ సీజన్ అయినా సరే ఈ సీజన్లో మూడు నాలుగు సినిమాలకు మించి స్కోప్ ఉండదు. కానీ ఈసారి ఏకంగా ఆరు సినిమాలు సంక్రాంతికి వస్తామని చెప్తున్నాయి. దీన్ని బట్టి పోటీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఫస్ట్‌లో ఏదో సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారులే, టైమ్ దగ్గరకొచ్చేసరికి కనీసం రెండు సినిమాలైనా వెనక్కి వెళ్తాయిలే అనుకున్నారు కానీ ఎవరికి వారే సంక్రాంతికి రావాలని మొండిగా ఉన్నారు. గత రెండు మూడు వారాల్లో ప్రతీ ఒక్కరూ తమ సినిమా సంక్రాంతికే వస్తుందని కుండబద్దలు కొడుతూ చెప్పారు.
గుంటూరు కారం, సైంధవ్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ ఇలా ప్రతీ సనిమా సంక్రాంతి రిలీజ్ ను గుర్తు చేస్తూ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశాయి. తాజాగా ఈగల్ మూవీ మేకర్స్ కూడా సంక్రాంతి రిలీజ్ ను కన్ఫర్మ్ చేశాయి. ఈ మధ్య ఈగల్ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఆ డౌట్స్‌ను పటాపంచలు చేస్తూ రీసెంట్గా తమ చిత్రం సంక్రాంతికే వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
ఇక మిగిలింది నాగ్ ఒక్కడే. నాగార్జున చేస్తున్న నా సామిరంగ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని, మూవీ అనౌన్స్మెంట్ టైమ్ లో చెప్పారు. ఆ తర్వాత నుంచి షూటింగ్‌ను వేగవంతం చేశారు కానీ ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు. అందరూ ఇచ్చినట్లే నాగ్ కూడా సంక్రాంతికి సినిమా ఉంటుందా లేదా అన్నది కన్ఫర్మ్ చేస్తే సంక్రాంతి సినిమాల లెక్కను ఫైనల్ చేసుకోవచ్చు.













