‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ట్రైలర్ విడుదల
అల్లు అర్జున్, డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “నా పేరు సూర్య” . మే 4న విడుదల కానున్న ఈ మూవీ ఆర్మీ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న గచ్చిబౌలిలో ప్రీ రిలీజ్ వేడుక జరపుకోనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. అయితే చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి కలిగిస్తున్నారు మేకర్స్. కొద్ది సేపటి క్రితం ‘నా పేరు సూర్య..’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘బిర్యానీ చాలా బాగుంది. రుచిగా ఉంది’ అని జైలులో ఉన్న ఖైదీ అంటే ‘ఇదే నీ ఆఖరి బిర్యానీ. ఇది తినేసరికి నిన్ను చంపేస్తా’ అనే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్‌తో పాటు, ప్రేమ, కుటుంబం అనుబంధాలను మేళవించి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చివర్లో శరత్‌కుమార్ ‘నీకు ఏం కావాలి రా!’ అని అడిగితే ‘ఇండియా కావాలి. ఇచ్చేయ్’ అనే సంభాషణ ఆకట్టుకుంటోంది.













