హనుమాన్ కు మైత్రీ సపోర్ట్
ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి సినిమాల పోటీ ఉండబోతుంది. ఒకటి, రెండు రోజుల తేడాతో 5 క్రేజీ ఫిల్మ్స్ పండక్కి ప్రేక్షకులను పలకరించనున్నాయి. వేటికవే ప్రత్యేక జానర్లు కావడంతో అన్ని సినిమాలకు క్రేజ్ ఉంది. విపరీతమైన పోటీ, పోస్ట్‌పోన్ చేసుకుమనే ఒత్తిడి మధ్య రిలీజ్ కానున్న హను మాన్ మూవీ కి ఇప్పుడు మైత్రీ అండ దొరికింది.
హను మాన్ నైజాం హక్కులను రూ. 7.20 కోట్లకు సొంతం చేసుకున్న మైత్రీ సంస్థ ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 12న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. మరోవైపు అదే రోజున రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమాను నైజాం ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి పోటీ మాత్రం గట్టిగానే ఉండబోతుంది.
గుంటూరు కారంను తట్టుకుని హను మాన్ నిలబడుతుందా అని డౌట్స్ వ్యక్త పరుస్తున్న ప్రతి ఒక్కరికీ, తమ సినిమా స్థాయి పెద్దదని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఓపెనింగ్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నా సరే తమ సినిమా రెండో వారం నుంచి పుంజుకోవడం ఖాయమని ప్రశాంత్ వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దానికి తోడు గుంటూరు కారంకు టికెట్స్ దొరకని పక్షంలో సెకండ్ ఆప్షన్ హను మాన్ అవనుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను పండగ బరిలోకి దింపారు.
అంతేకాదు, ఈ సినిమా త్రీడీ వెర్షన్ లో రానుంది. సినిమాను ఫస్ట్ టైమ్ చూసినవాళ్లు కచ్ఛితంగా పిల్లలను తీసుకుని మళ్లీ వచ్చే స్థాయిలో వీఎఫ్ఎక్స్ ఉంటాయని చిత్ర యూనిట్ తెగ ప్రచారం చేస్తోంది. వచ్చే వారం నుంచి హను మాన్ టీమ్ టీమ్ మరింత డిఫరెంట్ గా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తుందట. మరి ఇంత పోటీలో హను మాన్ విజృంభించాలంటే ఆ మాత్రం ఉండాలి.













