మైత్రీ నిర్మాతలు ఆ విషయాన్ని ఆలోచించాల్సిందే
మైత్రీ మూవీ మేకర్స్. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మంచి సినిమాలు తీసే బ్యానర్ అనిపించుకుంది. క్రేజీ కాంబినేషన్లతో పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సినీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతుంది.
ఓ వైపు పెద్ద సినిమాలు తీస్తూ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్న మైత్రీ బ్యానర్, చిన్న సినిమాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ బ్యానర్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన మీటర్ సినిమాకు యునానిమస్ డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎంత ఆ సంస్థ సిఓఓకు మద్దుతుగా భాగస్వామ్యం తీసుకున్నా సరే సినిమా రిజల్ట్ లో మాత్రం మైత్రీకి కూడా షేర్ దక్కుతుంది.
మీటర్ సినిమా ఒక్కటే కాదు, గతేడాది ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన హ్యాపీ బర్త్‌డే సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ బ్యానర్లో చిన్న సినిమాగా వచ్చిన ఒక్క మత్తు వదలరా సినిమా మాత్రమే కమర్షియల్ గా హిట్ అయ్యి, సేఫ్ అయింది తప్పించి, మిగిలిన చిన్న సినిమాలన్నీ రిజల్ట్ లో తేడా వచ్చినవే.
ఈ సినిమాలకు పెట్టిన బడ్జెట్ తక్కువే కావొచ్చు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ పేరిట ఆ బడ్జెట్‌ను రాబట్టుకుని కూడా ఉండొచ్చు కానీ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హిట్టయిందా లేదా అనేది చూసేది మాత్రం కేవలం థియేటర్ కలెక్షన్లను బట్టే. కాబట్టి ఈ విషయంలో మైత్రీ బ్యానర్ కొంచెం జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నప్పటికీ, ఇలాంటి సినిమాలు తీసి బ్యానర్‌కు ఉన్న ఇమేజ్ను దెబ్బ తీసుకోవడం అవసరం లేదు కదా.













