Mythri Movie Makers: 8 వసంతాలతో మైత్రీ అదరగొడుతుందా?

ఈ వారం తెలుగులో కుబేర(kubera)తో పాటూ 8 వసంతాలు(8 Vasanthalu) అనే మరో చిన్న సినిమా కూడా రిలీజవుతుంది. కుబేరతో పోలిస్తే ఆ రేంజ్ సినిమా కాకపోయినా 8 వసంతాలు సినిమాను తక్కువ చూపు చూడ్డానికి లేదు. దానికి కారణం ఈ సినిమాను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). దానికి తోడు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ ఆడియన్స్ లో అంచనాలను పెంచింది.
కాబట్టి చిన్న సినిమా అని లైట్ తీసుకోవడానికి లేదు. అసలే దర్శకుడు, మైత్రీ నిర్మాతలు సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచులను చూస్తే అర్థమవుతంది. ముందు రూ.4 కోట్లతో పూర్తి చేద్దామనుకున్న ఈ సినిమా పూర్తయ్యే నాటికి రూ.12 కోట్లు అయిందట. ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు రూ.9 కోట్లు వెనక్కి కూడా వచ్చాయట.
అంటే మరో రూ.3 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. మైత్రీ బ్యాకప్ ఉన్న సినిమాకు రూ.3 కోట్ల కలెక్షన్లు పెద్ద కష్టమేమీ కాదు. పైగా బజ్ ఉన్న సినిమా. సినిమాకు వచ్చే టాక్ ను బట్టి మైత్రీ లాభాల లెక్క ఉంటుంది. అసలే తెలుగులో పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రమొచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు 8 వసంతాలు ఆ లోటు తీరిస్తే మైత్రీ నిర్మాతలు జాక్ పాక్ కొట్టినట్టే. సినిమాపై నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాకు ఒక రోజు ముందుగా ప్రీమియర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారట.