Sri Vishnu: మైత్రి మూవీ మేకర్స్ శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు2 అనౌన్స్‌మెంట్

ప్రతిష్టాత్మక పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో ఎక్సయిటింగ్ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. హిలేరియస్ బ్లాక్‌బస్టర్ సామజవరగమనను అందించిన తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu), దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి ఈ వెంచర్ కోసం జతకడుతున్నారు. ఇది మరింత వైల్డ్‌గా, ఫన్ గా ఉంటుందని హామీ ఇస్తుంది.
‘శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’ కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్. కాన్సెప్ట్, హై-వోల్టేజ్ హ్యుమర్ ఎక్కువగా వుండే కథనంతో, ఈ చిత్రం నాన్-స్టాప్ వినోదాన్ని అందించబోతోంది.
ఈ చిత్రం దసరా శుభ సందర్భంగా ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్‌ను నారా రోహిత్‌తో కలిసి నిర్మాతలకు అందజేశారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
సామజవరగమనకి పని చేసిన రైటర్స్ భాను భోగవరపు, నందు సావిరిగణ మరోసారి స్క్రిప్ట్ రాయడానికి చేతులు కలిపారు. వారి సహకారం మరో మెమరబుల్ మూవీని అందించబోతోంది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బలమైన తారాగణం, టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. త్వరలో మేకర్స్ మిగతా వివరాలు తెలియజేస్తారు.