Mythri Movie Makers: తమిళ హీరోతో మైత్రీ సినిమా
శ్రీమంతుడు(Srimanthudu) మూవీతో ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాతలు అతి తక్కువ కాలంలోనే మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పెద్ద ప్రొడక్షన్ కంపెనీల్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటి. దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రీసెంట్ గా పుష్ప2(Pushpa2) తో భారీ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రేంజ్ మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తమ సంస్థను వ్యాపింపచేస్తున్నారు మైత్రీ ప్రొడ్యూసర్లు నవీన్, రవి శంకర్. ఇప్పటికే కోలీవుడ్ లో అజిత్(Ajith) తో గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమా తీస్తున్న మైత్రీ, బాలీవుడ్లో సన్నీ డియోల్(Sunny Deol) తో జాత్(Jaat) ను నిర్మిస్తుంది.
ఇప్పటికే అజిత్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ నిర్మాతలు ఇప్పుడు తమిళంలో ఓ యంగ్ హీరోతో మూవీని చేయనున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganadhan) హీరోగా ఓ సినిమాను చేస్తున్నామని, ఇప్పటికే 20 రోజుల షూటింగ్ కూడా పూర్తైందని మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటూ టైటిల్ ను రివీల్ చేయనున్నామని, ఈ కథ ఎంతో అద్భుతంగా ఉంటుందని నిర్మాత రవి తెలిపారు.













