Mythri Movie Makers: బాలీవుడ్ బడా స్టార్ తో మైత్రీ సినిమా?

శ్రీమంతుడు(Srimanthudu) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న సినిమాలను నిర్మించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). ఆ తర్వాత జనతా గ్యారేజ్(Janatha Garrage), రంగస్థలం(Rangasthalam), ఉప్పెన(Uppena), పుష్ప(Pushpa), పుష్ప2(Pushpa2) ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించి అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది మైత్రీ సంస్థ.
పుష్ప సినిమాతో తమ బ్యానర్ స్థాయిని మరింత పెంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే కోలీవుడ్ లో, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా జెండా పాతాలని చూస్తోంది. అందులో భాగంగానే మైత్రీ మూవీ మేకర్స్ ఓ భారీ ప్రాజెక్టును లైన్ లో పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయబోతున్నట్టు నెట్టింట వార్తలొస్తున్నాయి.
అంతేకాదు, ఈ సినిమా కోసం మైత్రీ సంస్థ షారుఖ్ కు రూ.300 కోట్లు కూడా ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఇప్పటివరకు ఇండియా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోగా షారుఖ్ పేరు టాప్ లో ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ గురించి ఇటు నిర్మాణ సంస్థ కానీ, అటు షారుఖ్ ఖాన్ కానీ క్లారిటీ ఇస్తే తప్ప దీన్ని నమ్మలేం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మైత్రీ సంస్థ ఈ ప్రాజెక్టు తర్వాత ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లడం ఖాయం.