మైత్రీకి లాభాల పంట కురిపిస్తున్న హను మాన్
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. సినిమాల రేంజ్ పరంగా ఈ బ్యానర్ ను నెం.1 బ్యానర్ గా చెప్పుకోవచ్చు. పుష్ప2తో కలిపి ఈ బ్యానర్ లో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ వరకు చేతిలో ఉన్నాయి. అయితే పెట్టుబడి-రాబడి యాంగిల్ లో చూస్తే మైత్రీ సంస్థకు బిగ్గెస్ట్ హిట్ హనుమాన్యే కావడం విశేషం.
అయితే హను మాన్ సినిమాను మైత్రీ బ్యానర్ నిర్మించలేదు. కేవలం హను మాన్ ను మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిందంతే. నైజాం ఏరియా రైట్స్ ను మైత్రీ నిర్మాతలు ఏడున్నర కోట్లకు కొన్నారు. సంక్రాంతి పోటీ వల్ల మొదట ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో థియేటర్లు దక్కలేదు. కానీ చివరకు సినిమాలో కంటెంట్ బాగుండే సరికి అన్ని చోట్లా హను మాన్ సినిమానే ప్రదర్శితమవుతుంది.
మొదట్లో థియేటర్లు ఇవ్వని వాళ్లే తర్వాత ఎగబడి మరీ హను మాన్ సినిమాను వేస్తున్నారు. 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు ఇలా ఒక్కో మార్క్ ను దాటి ఇప్పుడు ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్ల షేర్ మార్క్ ను నైజాంలో టచ్ చేసింది. హను మాన్ లాంటి మిడ్ రేంజ్ సినిమా నైజాంలో రూ.30 కోట్ల షేర్ ను సాధించడమంటే మాటలు కాదు. దీంతో మైత్రీ నిర్మాతల ఆనందం చెప్పే రేంజ్ లో లేదు. ఒక్క నైజాంలోనే కాదు హను మాన్ రిలీజైన ప్రతీ ఏరియాలోనూ పెట్టిన దానికి రెండింతల లాభం వచ్చినట్లు సమాచారం.













