మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరంజీవి , బాలకృష్ణ, ఎన్టీయార్ చిత్రాలు
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం హీరో ప్రభాస్ తో సాలార్ చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే! అయితే తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీయార్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ భారీ సినిమాను నిర్మించనుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. `కేజీఎఫ్-2` తర్వాత ఎన్టీయార్‌తోనే ప్రశాంత్ సినిమా ఉంటుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా `సలార్` ప్రకటన బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందని టాక్ బయల్దేరింది. ఆ సినిమాతోపాటు పలువురు స్టార్ హీరోలతో తాము నిర్మించనున్న సినిమాల గురించి మైత్రీ మూవీస్ అధినేతలైన నవీన్ యెర్నేని రవి శంకర్ లు ఆఫీసియల్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.
ఎన్టీఆర్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది. కాకపోతే కాస్త లేట్ అవుతోందంతే. `సలార్` పూర్తయిన వెంటనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంద`ని క్లారిటీ ఇచ్చారు. అలాగే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమాను నిర్మిస్తున్నామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. బాలయ్య-బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే తమ సినిమా పట్టాలెక్కుతుందన్నారు. ఇక, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభిస్తామన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్లో తాము నిర్మిస్తున్న సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు.













