Maisa: రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’
నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మైసా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ల తర్వాత, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
వణుకు పుట్టించే ఈ టీజర్, మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్ మొదలైయింది.
ఈ పాత్ర కోసం రష్మిక మందన్న చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. ఇది ఆమె కెరీర్లోనే అత్యంత రా అండ్ వైలెంట్ క్యారెక్టర్. రక్తం మరకలతో నిండిన రఫ్ లుక్‌లో మైసా పాత్రలో రష్మిక ఫైర్ లా కనిపించింది. టీజర్ చివర్లో ఆమె చేసే గర్జన, మైసా పాత్రలో దాగున్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా చూపించింది.
రవీంద్ర పుల్లే ఈ కథను ఎంతో డెప్త్ తో, అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. కథనం ఎక్కడా రాజీ పడకుండా, పూర్తిగా ఇంటెన్స్‌గా సాగుతుందని టీజర్ స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా, గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా రష్మిక పాత్రను చూపించిన విధానం ఇండియన్ సినిమాల్లో అరుదైన, ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్ ప్రయత్నంగా నిలుస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పి కృష్ణ అందించిన విజువల్స్ కథలోని డార్క్ వాతావరణాన్ని ప్రభావవంతంగా చూపిస్తుండగా, జేక్స్ బిజోయ్ ఇచ్చిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైసా పాత్రకు మరింత ఎలివేట్ చేసింది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సులు రా అండ్ రియలిస్టిక్‌గా కనిపిస్తూ సినిమాకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న విజన్, స్కేల్ టీజర్లోనే స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుగుతున్న మైసా యాక్షన్‌ను ప్రధానంగా రూపొందుతోంది. ఇంటెన్స్ రిహార్సల్స్, లైవ్ లొకేషన్లలో డీటెయిల్డ్ రెక్కీతో, సినిమాను రూటెడ్ గా నిర్మించిందేకు మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. టీజర్ విడుదలతోనే మైసా పై బజ్ భారీగా పెరిగింది. రష్మిక మందన్న కెరీర్లోనే ఇది మైల్ స్టోన్ మూవీగా నిలవనుంది.






