Mysa: దీపావళికి మైసా గ్లింప్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(rashmika mandanna) ఓ వైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ కెరీర్లో దూసుకెళ్తుంది. రెండు ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న రష్మిక, ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది.
అయితే రీసెంట్ గా మైసా(Mysaa) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన రష్మిక కెరీర్లోనే మొదటిసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. రవీంద్ర పుల్లే(Ravindra pulle) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై నెలాఖరు నుంచి మొదలవగా, షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడే మైసా మూవీకి సంబంధించి 50% షూటింగ్ పూర్తైందట.
ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఫ్యాన్స్ అమ్మడి స్పీడుకు షాకవుతున్నారు. అంతేకాదు, ఈ దీపావళికి మైసా నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్(Mysaa Glimpse) ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. యాక్షన్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ గ్లింప్స్ లో రష్మిక నట విశ్వరూపం చూస్తారని చెప్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో మైసా రిలీజ్ కానుంది.