సీఎం జగన్ కు మెగాస్టార్ ధన్వవాదాలు
సినీ పరిశ్రమ మీద వరాలు జల్లు కురిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్వవాదాలు తెలిపారు. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విటర్లో ఎగ్జిబిటర్స్ కోసం సినిమా రిసార్ట్ ప్యాకేజీని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్ధరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది అని ట్వీట్ చేశారు. అదే విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను పలువురు ప్రముఖులు అభినందించారు. లాక్డౌన్ వల్ల లేర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు.













