రెహమాన్, అనిరుధ్ పోలిక ఎంత వరకు కరెక్ట్?
ప్రస్తుతం సౌత్ లో బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ కు పేరుంది. ఒక్కో సినిమాకు అనిరుధ్ రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయినా సరే నిర్మాతలు అతనితో సినిమా చేయించుకోవడానికి రెడీగా ఉన్నారంటే తన డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్, జైలర్ సినిమాలతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు అనిరుధ్.
అందుకే దేవర కోసం ఎన్టీఆర్, కొరటాల కొరి మరీ అనిరుధ్ ను తీసుకున్నారు. అయితే అనిరుధ్ సంగీతంలో వస్తున్న ఇండియన్2 ఆడియో రీసెంట్ గానే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ ను ఇండియన్ ఫస్ట్ పార్ట్ సాంగ్స్ ను కంపేర్ చేస్తున్నారు ఆడియన్స్. పాతికేళ్ల కిందట డీటీఎస్ టెక్నాలజీ అప్పుడప్పుడే వస్తున్న టైమ్ లో తన సాంగ్స్, బీజీఎం తో మ్యూజిక్ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు ఏఆర్ రెహమాన్.
అందులోని ప్రతీ పాటా ఎవర్ గ్రీన్ సాంగే. ఈ నేపథ్యంలో ఆడియన్స్ అనిరుధ్ నుంచి ఇండియన్2 లో ఆ స్థాయి మ్యూజిక్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి స్టైల్ వేరు కాబట్టి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. కానీ తన మీద ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు తెలుసు కాబట్టి కెరీర్ బెస్ట్ ఇచ్చేలా అనిరుధ్ ఇండియన్2 సాంగ్స్ ను కంపోజ్ చేయాల్సింది కానీ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఇండియన్2 లో ఓ రెండు పాటలు తప్పించి మిగిలిన వాటికి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. మరి స్క్రీన్ పై ఈ సాంగ్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తాయేమో చూడాలి.













