అనిరుధ్ ఆయన ప్లేస్‌ను ఆక్యుపై చేశాడా?
3 మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిరుధ్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని వరుస సినిమాలతో, సక్సెస్‌లను అందుకుని కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఇయర్ జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిరుధ్, ఆ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ అందుకున్నాడు.
చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, తమిళంలో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న దేవర, VD12 సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇవి కాకుండా రజినీ తర్వాతి రెండు సినిమాలకు కూడా అనిరుధ్‌నే సంగీతం ఇవ్వనున్నాడు. అలాగే కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్2 సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
రెహమాన్ కోలీవుడ్‌ను ఏలుతున్న టైమ్ లో వచ్చిన అనిరుధ్, ఇప్పుడు ఛాన్సులన్నింటినీ తనే సొంతం చేసుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు అనిరుధ్ ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే కొంతమంది రెహమాన్ ప్లేస్‌ను అనిరుధ్ ఆక్యుపై చేశాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రెహమాన్ సెలెక్టివ్ గా సినిమాలు చేయడం కూడా అనిరుధ్ కు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పాలి.













