Thaman: విజనరీ సీఎంతో టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్యకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే తన అన్న బాలకృష్ణ ఇంత గొప్ప పురస్కారానికి అర్హత సాధించినందుకు తన చెల్లెలు నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) నిన్న ఓ గ్రాండ్ పార్టీని హోస్ట్ చేసింది.
హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటూ వారికి అత్యంత సన్నిహితులు, బాలయ్యతో పని చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్(thaman) కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు.
ఆ పార్టీలో తమన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి(Nara Chandra babu Naidu)ని కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేస్తూ విజనరీ సీఎం చంద్రబాబు గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే బాలయ్య(Balayya) తన తర్వాతి సినిమాగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) తో చేస్తున్న అఖండ2(Akhanda2) సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తమనే పని చేస్తున్నాడు.













