Thaman: తమన్ ముందు పెద్ద ఛాలెంజ్
సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలూ పెద్ద హీరోలవే. ఆ మూడింటిలో రెండు సినిమాలకు తమనే(Thaman) మ్యూజిక్ డైరెక్టర్. అవే గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj). ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ వేటికీ గొప్ప రెస్పాన్స్ రాలేదు. అందరికీ షాకిస్తూ సంక్రాంతికి వస్తున్నాం(Sankaranthiki Vasthunnam) సినిమాకు భీమ్స్(Bheems ciciroleo) కంపోజ్ చేసిన సాంగ్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి.
రమణ గోగుల(Ramana Gogula) పాడిన గోదారి గట్టు మీద(Godari Gattu Mida) సాంగ్ ఏకంగా 50 మిలియన్లు దాటేసి ఛార్ట్ బస్టర్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే తమన్ కు ఇది పెద్ద షాకే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బాలయ్య(Balayya), చరణ్(Charan) సినిమాల కంటే వెంకీ(Venky) సినిమాకు హైప్ పెరగడం ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు తమన్ ముందు పెద్ద ఛాలెంజ్‌లు చాలానే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తన బీజీఎంతో తమన్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకర్(Shankar) నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తమన్ గేమ్ ఛేంజర్ కు కచ్ఛితంగా ది బెస్ట్ ఇవ్వాలి. దానికి తోడు డాకు మహారాజ్ గురించి నిర్మాత నాగవంశీ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నాడు. నాగవంశీ(Naga Vamsi) ఎలివేషన్స్ నిలబడాలంటే తమన్ గట్టిగా డ్యూటీ చేయాలి. ఓ వైపు భీమ్స్ తనకొచ్చిన స్టార్ ఛాన్స్ ను వాడుకుంటూ ముందుకెళ్తున్న టైమ్ లో తమన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













