Thaman: ఇన్నేళ్ల తర్వాత నటించడానికి కారణమదే!
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ప్రస్తుతం సౌత్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు. కెరీర్ మొదట్లో బాయ్స్(Boys) సినిమాలో నటించిన తమన్ ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత సినిమా ఒప్పుకోవడానికి గల కారణాన్ని రీసెంట్ గా తమన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని, అందుకే ఆ సినిమాను ఒప్పుకున్నానని దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తనకే ఛాన్స్ ఇచ్చారని చెప్పాడు. ఆల్రెడీ ఆ సినిమాలో ఓ సీన్ కోసం 10 రోజుల పాటూ షూటింగ్ కూడా చేశానని, పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మూవీ షూటింగ్ లేటవుతూ వస్తుందని చెప్పిన తమన్, ఆ మూవీలో పెళ్లి సీన్ కూడా ఉందని తెలిపాడు.
తన పేరు మార్పు గురించి కూడా తమన్ మాట్లాడాడు. తన పేరు తమన్. ఎస్ అని కానీ కెరీర్ స్టార్టింగ్ లో తమన్ ఎస్.ఎస్ అని వేసేవారని, అలా వేసిన వాటిలో 10 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పాడు. అయితే ఇప్పుడు దాంతో బాధ లేదని అంతా మన కంట్రోల్ లోనే ఉందని తమన్ వెల్లడించాడు. భైరవద్వీపం(bhairava dweepam) సినిమాతో తన కెరీర్ మొదలైందని, ఆ సినిమాకు వర్క్ చేసినందుకు మొదటి రోజు తనకు రూ.30 జీతం ఇచ్చారని, సినిమా మొత్తానికి రూ.270 తీసుకున్నానని తమన్ వెల్లడించాడు.













