Thaman: రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్
టాలీవుడ్ లోని బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడైపోయాడు. స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రస్తుతం తమన్ చేతిలోనే ఉన్నాయి. శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) కు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. శంకర్ సినిమాకు సంగీతం అందించే స్థాయికి తమన్ వెళ్లాడంటే ఆయన స్థాయి అర్థం చేసుకోవచ్చు.
తమన్ నుంచి ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ తనదైన ముద్ర వేయగలడు. అయితే ఈ మధ్య తమన్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశాడనే మాట ఫిల్మ్ నగర్ లో బాగా వినిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది తమనే అని ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ ముందుకు ఈ ప్రశ్న రాగా, దానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వినిపించే వార్తలన్నీ అబద్ధమని, మిగిలిన వారితో పోలిస్తే నేను 50% తక్కువ పారితోషికమే తీసుకుంటున్నానని, నిర్మాతని ఎప్పుడూ నాకింత ఇవ్వండని డిమాండ్ చేయనని, మ్యూజిక్ విషయంలో క్వాలిటీ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంటే నిర్మాత అంత పెట్టలేనని మధ్యలో అంటే ఆ డబ్బును కూడా నేనే పెట్టి పూర్తి చేసి అవుట్పుట్ ఇస్తానని, తనకు వృత్తి అంటే తల్లితో సమానమని, అలాంటి తల్లిని మధ్యలో వదిలేయకలేనని తమన్ వెల్లడించాడు.













