థమన్ ముందు రెండు భారీ ఛాలెంజ్‌లు
ఓ పెద్ద సినిమా వస్తుందంటే హీరో మీద, డైరెక్టర్ మీద ఏ రేంజ్ అంచనాలుంటాయో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా అన్నే అంచనాలుంటాయి. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో బెస్ట్ ఆల్బమ్ కావలంట సదరు మ్యూజిక్ డైరెక్టర్ ని డిమాండ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ముందు కూడా అలాంటి ఛాలెంజులే ఉన్నాయి.
మంచి మంచి పాటలతో వరుస చార్ట్ బస్టర్స్ ఆల్బమ్స్ తో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న థమన్ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో చెప్పుకోదగ్గవంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ ఒకటి, మరోకటి మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ssmb28 మరొకటి. ఈ రెండు సినిమాల విషయంలో థమన్ కు ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి గట్టి ప్రెజరే ఉంది.
మామూలుగా శంకర్ చేసే ప్రతి సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తుంటాడు. వారిద్దరిది అల్టిమేట్ కాంబో. కానీ మొదటిసారి శంకర్ తన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను థమన్ చేతిలో పెట్టాడు. అంటే గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మంచి మ్యూజిక్ ఇస్తే సరిపోదు. రెహ్మాన్ కు మించే ఆల్బమ్ ఇస్తేనే థమన్ తన పేరును నిలబెట్టుకున్నట్లు లెక్క్. ఈ సినిమా ఆల్బమ్ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ తో పాటూ థమన్ కు మహేష్ సినిమా మ్యూజిక్ కూడా పెద్ద టాస్కే. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాటలో కేవలం ఒక్క సాంగ్ మాత్రమే సూపర్బ్ అనేలా ఉంది. మిగిలినవన్నీ అంతంతమాత్రంగానే ఉండి ఫ్యాన్స్ కు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు బెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత థమన్ కు ఉంది. అంతే కాదు మహేష్- త్రివిక్రమ్ కాంబోలో సినిమాలకు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకు కూడా థమన్ చాలా గట్టిగానే పనిచేయాల్సి ఉంటుంది. మరి ఈ రెండు ఛాలెంజ్‌లను థమన్ ఎలా ఎదుర్కొని ఫ్యాన్స్ ని తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడో చూడాలి.













