సంగీత దర్శకుడు శశిప్రీతమ్‌కు అస్వస్థత
`ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..` ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాట 1996లో విడుదలైన`గులాబి` చిత్రంలోనిది. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమై యూత్‌కి ఓ అద్భుతమైన పాటను అందించారు శశిప్రీతమ్. ఆయన అస్వస్థతకు లోనయ్యారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను బంజారా హిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శశి ఐసియులో ఉన్నారు. ఎంతో క్రిటికల్ పొజిషన్లో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, సరైన సమయంలో సరైన వైద్య చికిత్స అందించామని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
1996లో సంగీత దర్శకుడిగా పరిచయమైనప్పటికీ శశిప్రీతమ్‌కు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. అయితే ఆయన కెరీర్లో `ఈవేళలో నీవు..` సాంగ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. `గులాబి` చిత్రం విడుదలై పాతిక సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి యూత్.. ముఖ్యంగా అమ్మాయిలు తమకు `ఈవేళలో..` ఎంతో ఇష్టం అని చెబుతుంటారు. ఈ పాటకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీత తొలి పాట ఇదే. అలాగే `గులాబి` చిత్రంతోనే కృష్ణవంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు.













