Spirit: స్పిరిట్ లో అలాంటి నటన చూస్తారు: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్
కల్కి(Kalki)తో బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The raja saab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) చేస్తున్న ప్రభాస్ వరుస షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ఎప్పుడు పూర్తవుతాయో తెలియకపోతుంటే ప్రభాస్ మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు.
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) మూవీ చేయాల్సి ఉన్న డార్లింగ్ దాంతో పాటూ నీల్(Prasanth Neel) తో సలార్2(Salaar2), నాగ్ అశ్విన్(Nag Ashwin) తో కల్కి2(Kalki2) సినిమాలను ఫినిష్ చేయాల్సి ఉంది. అయితే వీటన్నింటిలో ప్రభాస్ ముందుగా సందీప్ రెడ్డితో స్పిరిట్ నే ముందు మొదలుపెట్టనున్నాడు. సందీప్-ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అయితే స్పిరిట్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్(Harsha Vardhan Rameshwar) సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఈ సినిమా ఉగాదికి మొదలవుతుందని చెప్పిన ఆయన బాహుబలి(Baahubali) తర్వాత ప్రభాస్ నుంచి మళ్లీ ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూడలేదని, స్పిరిట్ లో అలాంటి పెర్ఫార్మెన్స్ ఉంటుదని, దాన్ని చూడ్డానికి తానెంతగానో వెయిట్ చేస్తున్నట్టు హర్షవర్ధన్ తెలిపాడు.













