దేవీ శ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం…. ఒకే రోజున బాబాయ్, మేనత్తలు మరణం
టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేశీ శ్రీ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన బాబాయ్, మేనత్త ఒకే సారి మృతి చెందారు. దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సోదరుడి మరణ వార్త విని దేవీ శ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్షి గుండెపోటుతో మరణించారు. దీంతో వరుస మరణ వార్తలు విని దేవి శ్రీ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలకూ తన సంగీతంతో మరపురాని సాంగ్స్ అందించారు దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు ‘పుష్ప’కు బాణీలు కడుతున్నారు దేవీ శ్రీ. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆయన ఇంట్లో ఊహించని విధంగా వరుస విషాదాలు చోటు చేసుకున్నాయని తెలిసి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.













