Murugadoss: రూ.1000 కోట్ల కలెక్షన్లపై మురుగదాస్ విచిత్ర వ్యాఖ్యలు

ఇండియన్ సినిమాలో ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా ఇప్పుడందరి దృష్టి రూ.1000 కోట్ల కలెక్షన్లపైనే ఉంది. కోలీవుడ్ ఆడియన్స్ కు ఆ దృష్టి ఇంకాస్త ఎక్కువుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ లో రూ.1000 కోట్ల కలెక్షన్లు అందుకున్న సినిమాలు ఉండగా, ఒక్క తమిళ ఇండస్ట్రీలో మాత్రమే ఇంకా ఆ రికార్డు బ్రేక్ అవలేదు. విక్రమ్(Vikram), లియో(leo), జైలర్(Jailer) రీసెంట్ గా వచ్చిన కూలీ(Coolie) సినిమాలు ఆ రికార్డును బ్రేక్ చేస్తాయనుకుంటే అది కలగానే మిగిలింది.
ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా వచ్చినా ఆ సినిమాకు సంబంధించిన దర్శకనిర్మాతలకు రూ.1000 కోట్ల కలెక్షన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కు కూడా ఈ ప్రశ్న ఎదురైంది. మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసి(Madarasi) ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన మురుగదాస్ కు రూ.1000 కోట్ల కలెక్షన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురవగా దానికి ఆయన ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఉంది.
ఇతర భాషలకు సంబంధించిన డైరెక్టర్లు కేవలం ఆడియన్స్ ను ఎంటర్టైన్ మాత్రమే చేస్తారని, కానీ తమిళ డైరెక్టర్లు ఆడియన్స్ ను ఎడ్యుకేట్ చేస్తారని, అందుకే మనకు కలెక్షన్లు రావని, తమిళ డైరెక్టర్లను వేరే డైరెక్టర్లతో పోల్చకూడదని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇతర పరిశ్రమలకు చెందిన ఆడియన్స్ ఆయనపై ఫైర్ అవుతూ మీరు చేసిన స్పైడర్(Spyder), సికిందర్(Sikinder) సినిమాలతో ఆడియన్స్ ను ఏం ఎడ్యుకేట్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.