మురుగదాస్ ను వదలని అదృష్టం
ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే ఫామ్ లో లేకపోతే స్టార్ హీరో నుంచి ఛాన్సులు అందుకోలేడు. ఒకప్పుడు గజినీ లాంటి సూపర్ హిట్ సినిమాలతో సౌత్ ను ఏలిన మురుగదాస్ తుపాకీ సినిమా వరకు మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత తను తీసిన ప్రతీ సినిమా ట్రాక్ తప్పింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఎప్పటికీ మరిచిపోలేని గాయంగా స్పైడర్ ను మిగిల్చాడు.
రజినీకాంత్ పిలిచి మరీ దర్బాబ్ ఆఫర్ ఇస్తే అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో సినిమాను ఓకే చేసుకున్న మురుగదాస్ కు ఈసారి మరో బంపరాఫర్ తగిలింది. ఆ ఆఫర్ కూడా బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ తో. కిక్ 2 కోసం మురుగదాస్ ను డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు ముంబై మీడియా వర్గాలంటున్నాయి.
రవితేజ కిక్ ను 2014లో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు సల్మాన్. తెలుగులో కిక్2 ఫ్లాప్ అవడంతో మరో ఫ్రెష్ సబ్జెక్ట్ తో చేయాలని డిసైడ్ అయి స్టోరీ రెడీ చేసుకున్నారు. ముందు వేరే డైరెక్టర్ తో చేద్దామనుకున్నప్పటికీ అది వర్కవుట్ అవకపోవడంతో చివరకు మురుగదాస్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రంజాన్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లనున్నారట. మొత్తానికి ఎన్ని ఫ్లాపులున్నా, ఫామ్ లో లేకపోయినా మురుగదాస్ ను లక్ ఏ రకంగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు.













